“నాటు నాటు” ఉండదు: వెంకీ మామ

Venky75

వెంకటేష్ నటించిన మొదటి వెబ్ సిరీస్… రానా నాయుడు. ఈ వెబ్ సిరీస్ లో వెంకటేష్ ఉపయోగించిన బూతులు విని చాలామంది గాభరపడ్డారు. నిజజీవితంలో కూడా ఇన్ని బూతులు సామాన్యులు మాట్లాడారు. బూతులు, అశ్లీల సన్నివేశాలతో నిండిన ఆ వెబ్ సిరీస్ వెంకటేష్ ని కుటుంబ ప్రేక్షకులకు దూరం చేసింది. ఐతే, ఈ వెబ్ సిరీస్ తో తనకు యువత చేరువయింది అని వెంకీ మామ అనుకుంటున్నారు.

కానీ రెండో సీజన్లో మాత్రం “నాటు నాటు” చెయ్యను అంటున్నారు. “మరీ అంత నాటు ఉండదు,” అని వెంకటేష్ తాజాగా చెప్పారు.

కొంత నాటు, కొంత నీటు అన్నట్లుగా సాగుతుంది అన్నమాట. “రానా నాయుడు”తో హిందీ, ఇతర భాషా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి అని వెంకీ భావిస్తున్నారు. ఆ మార్కెట్ తనకి కలిసొచ్చినట్లు అనుకుంటున్నారు. ఫ్యూచర్లో తన సినిమాలకు ఈ మార్కెట్ కలిసి వస్తుంది అనేది వెంకీ భావన. అందుకే రెండో సీజన్ కి కూడా ఓకె చెప్పారు.

60 ప్లస్ వయసులో ఇలాంటి కంటెంట్ అవసరమా అన్న మాటకు మాత్రం వెంకీ మామ లైట్ తీసుకో అని సమాధానం ఇస్తున్నారు.

 

More

Related Stories