సుమన్ పాటకు వెంకీ స్టెప్పులు

“కుర్రాడు బాబోయ్ కుంపటెక్కినాడు.. ” 90ల్లో సూపర్ హిట్టయిన సాంగ్ ఇది. తాజాగా ఈ పాట ఎఫ్3లో వినిపించింది. ఓ సన్నివేశంలో అనీల్ రావిపూడి ఈ సాంగ్ పెట్టాడు. కాకపోతే కొద్దిగా రీమిక్స్ చేశాడు. దానికి వెంకీతో అదిరిపోయే స్టెప్పులు వేయించాడు.

ఆ పాట గురించి సోషల్ మీడియాలో ప్రత్యేకంగా చర్చ జరిగింది. ఇప్పటితరానికి కూడా ఈ రీమిక్స్ సాంగ్ పరిచయమే కానీ, అది ఏ సినిమాలోది, అందులో హీరో ఎవరనే విషయంపై చాలామందికి తెలియదు. హీరో సుమన్ నటించిన చిన్నల్లుడు సినిమాలోనిది ఈ పాట. ఇప్పుడీ మొత్తం ఎపిసోడ్ పై సుమన్ స్పందించారు.

తన పాటకు మరోసారి గుర్తింపు రావడంతో సుమన్ హ్యాపీగా ఫీలయ్యారు. అప్పట్లో హిట్టయిన ఆ సాంగ్ ఇప్పటి ఆడియన్స్ కు కూడా నచ్చడం చాలా ఆనందంగా ఉందన్నారు. మరీ ముఖ్యంగా తన పాటకు వెంకటేష్ స్టెప్పులేశాడని తెలిసి సంతోషం వేసిందన్నారు. తను ఎఫ్3 సినిమా చూడలేదని.. చాలామంది తనకు ఫోన్లు, మెసేజీలు చేస్తున్నారని అన్నారు సుమన్. 

 

More

Related Stories