మోసగాళ్ల గ్రూప్ లో చేరిన వెంకటేష్

Venkatesh

హీరో విక్టరీ వెంకటేష్ “మోసగాళ్ల” గ్రూప్ లో చేరాడు. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ‘మోసగాళ్లు’ అనే సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు వెంకటేష్. అలా ‘మోసగాళ్లు’ టీమ్ లో వెంకీ కూడా ఓ భాగమయ్యాడు.

ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు మంచు విష్ణు. అందుకే ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. తన పరిచయాలు ఉపయోగించి స్టార్స్ అందర్నీ రంగంలోకి దించుతున్నాడు. ఇందులో భాగంగా ఈ సినిమా టీజర్ ను అల్లు అర్జున్ తో రిలీజ్ చేయించాడు విష్ణు. మోషన్ పోస్టర్ ను వెంకటేష్ తో లాంఛ్ చేయించిన ఈ మంచు హీరో, ఇప్పుడు మరోసారి వెంకీని తన సినిమా కోసం వాడేశాడు.

లాక్ డౌన్ తో పూర్తిగా ఇంటికే పరిమితమైపోయాడు వెంకటేష్. ప్రస్తుతం చేస్తున్న ‘నారప్ప’ సినిమాను కూడా పూర్తిగా పక్కనపెట్టేశాడు. కొత్త కథలు కూడా వినడం మానేశాడు. అలాంటి వెంకటేష్ ను ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి వాయిస్ ఓవర్ చెప్పించిన ఘనత మంచు విష్ణుకే దక్కుతుంది.

Related Stories