వెంకీకి కీలకంగా మారిన ఎఫ్3

విడుదలకు ముందు నుంచే ఎఫ్3 సినిమా యూనిట్ లో నవ్వులు కనిపిస్తున్నాయి. సినిమా సక్సెస్ పక్కా అనే కాన్ఫిడెన్స్ అందర్లో ఉంది. కానీ ఒక్కరు మాత్రం టెన్షన్ పడుతున్నారు. అతడే విక్టరీ వెంకటేష్. చాన్నాళ్ల తర్వాత ఈ సినిమాతో థియేటర్లలో అడుగుపెడుతున్నాడు వెంకీ.

వెంకటేష్ నుంచి చివరిసారి థియేటర్లలోకి వచ్చిన సినిమా వెంకీమామ. ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత చేసిన 2 సినిమాలు ఓటీటీలో నేరుగా విడుదలయ్యాయి. నారప్ప, దృశ్యం-2 రెండూ థియేటర్లను మిస్సయ్యాయి. దీంతో వెంకీ థియేట్రికల్ మార్కెట్ పై అనుమానాలు పెరిగాయి.

ఇలాంటి టైమ్ లో థియేటర్లలోకి వస్తోంది ఎఫ్3 సినిమా. అందుకే ఈ సినిమా సక్సెస్ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు వెంకటేష్. తన మార్కెట్ ను తనే చెక్ చేసుకోబోతున్నాడు.

ఎఫ్3 హిట్టయితే వెంకటేష్ కు మరింత ఉత్సాహం వస్తుంది. ఈ సినిమా తర్వాత అతడు సోలో హీరోగా వరుసపెట్టి సినిమాలు చేయబోతున్నాడు. ఆ సినిమాలపై అతడికి మరింత నమ్మకం పెరుగుతుంది. అందుకే ఎఫ్3 సినిమా వెంకీకి కీలకంగా మారింది. 

 

More

Related Stories