రానా నటుడిగా ఎదిగాడు: వెంకీ

రానా దగ్గుబాటి హీరోగా రూపొందిన కొత్త మూవీ.. ‘అరణ్య’. ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రోజు పార్క్ హయత్ హోట‌ల్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ జరిగింది. ముఖ్య అతిథిగా హాజ‌రైన విక్ట‌రి వెంక‌టేష్ ‘అర‌ణ్య’ మూవీ స్పెష‌ల్ ప్రోమోని రిలీజ్ చేశారు.

“లీడర్, ఘాజీ, బాహుబలి.. ఇలా రానా విభిన్నమైన పాత్రలు పోషించాడు. ఇక మెల్లగా మంచి యాక్టర్ అవుతాడు అనుకున్నా. కానే, ‘అరణ్య’ సినిమాలో రానా నటన చూసి స్టన్ అయ్యాను. నటుడిగా చాలా ఎదిగాడని అనిపిస్తుంది. నిన్నే సినిమా చూశాను,” అని వెంకటేష్ తెలిపారు.

More

Related Stories