ప్రమోషన్ లో వెంకీ దూకుడు

Venkatesh

సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో ఎక్కువగా ప్రమోషన్ లలో పాల్గొంటున్న హీరో ఎవరంటే వెంకటేష్ అనే చెప్పాలి. ఈ సీనియర్ గత రెండు నెలలుగా “సైన్ధవ్” సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ప్రతి ఈవెంట్ కి అటెండ్ అవుతున్నారు. కాలేజ్ ఈవెంట్స్ కి కూడా వెళ్తున్నారు.

ఇప్పటికే విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలు కూడా తిరిగారు వెంకటేష్. ఈ సినిమా వచ్చే నెల 13న విడుదల కానుంది. కానీ ఇప్పటికే చాలా ప్రమోషన్స్ చేశారు వెంకటేష్. మిగతా 15 రోజుల్లో పెద్ద లైనప్ పెట్టుకున్నారు.

వెంకటేష్ కి ఇప్పుడు మంచి హిట్ అవసరం. ఇది ఆయన కెరీర్ లో 75వ చిత్రం. ఇంతకుముందు “ఎఫ్ 3” విడుదలై విజయం సాధించింది. కానీ సోలో హీరోగా ఇది ఆయనకి చాలా గ్యాప్ తర్వాత మూవీ. అందుకే, ఎక్కువ పబ్లిసిటీ చేస్తున్నారు.

పైగా సంక్రాంతికి మహేష్ బాబు, నాగార్జున, రవితేజ వంటి ఇతర హీరోలు బరిలో ఉన్నారు. పోటీలో తన సినిమాకి మంచి ఓపెనింగ్ రావాలంటే పబ్లిసిటీ తప్పదు.

Advertisement
 

More

Related Stories