వెంకటేష్ రెండో కుమార్తె నిశ్చితార్థం

హీరో వెంకటేష్ దగ్గుబాటి రెండో కుమార్తె నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే ఆయన తన కూతురు హయవాహిని (Hayavahini Daggubati) నిశ్చితార్థ కార్యక్రమాన్ని రెండు రోజుల క్రితం వారి ఇంట్లోనే ఘనంగా నిర్వహించారు.

విజయవాడకి చెందిన ఒక డాక్టర్ తో హయవాహిని పెళ్లి (Hayavahini Daggubati) జరగనుంది. ఈ డాక్టర్ కుటుంబం విజయవాడకి చెందిన ఒక పేరొందిన కార్పొరేట్ హాస్పిటల్ రన్ చేస్తోంది.

చిరంజీవి, మహేష్ బాబు సహా పలువురు హీరోలు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఇక వారి కుటుంబ హీరోలు రానా, నాగ చైతన్య కూడా హాజరయ్యారు.

వెంకటేష్, నీరజ దంపతులకు నలుగురు పిల్లలు. నాలుగేళ్ళ క్రితం పెద్ద అమ్మాయి ఆశ్రిత పెళ్లి జరిగింది. ఇక హయవాహిని పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది. వెంకటేష్ కొడుకు అర్జున్ హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

 

More

Related Stories