‘పేరు, డబ్బులు వస్తున్నాయి’

దర్శకుడు వెంకీ అట్లూరి తీసిన ‘సార్’ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. ధనుష్ నటించిన ఈ సినిమాకి వసూళ్లు బాగా ఉండడంతో టీం సంబరాలు చేసుకుంటోంది. ఐతే, రివ్యూస్ లలో అందరూ ఈ సినిమాకి, బాలీవుడ్ మూవీ ‘సూపర్ 30’కి దగ్గరి ఉందని రాశారు. కానీ, వెంకీ మాత్రం అలాంటిదేమి లేదంటున్నాడు.

ఈ కథలో ధనుష్ గారి కంటే ముందు ఎవరినైనా అనుకున్నారా?

ధనుష్ తప్ప ఇంకో ఆలోచన రాలేదు. ధనుష్ ఒప్పుకుంటాడా అని మా నిర్మాతలు సంశయించారు. లాక్ డౌన్ లో ఈ కథ రాసుకున్నాను. ఆయనకు కథ చెప్పే అవకాశం వచ్చిందని చెప్పగానే మా నిర్మాతలు ఆనంద పడ్డారు. కథ చెప్పగానే ధనుష్ క్లాప్స్ కొట్టి డేట్స్ ఎప్పుడు కావాలి అని అడిగారు.

త్రివిక్రమ్ గారి పాత్ర ఎంత?

ఒక ప్రొడ్యూసర్ కి, డైరెక్టర్ కి మధ్య కథా పరంగా ఎలాంటి చర్చలు జరుగుతాయో అలాంటి చర్చలే జరిగాయి. ఏదైనా సీన్ నచ్చితే వెంటనే బాగుందని మెచ్చుకునేవాళ్ళు. కొన్ని కొన్ని సీన్లు ఇలా చేస్తే బాగుంటుందని సలహాలు ఇచ్చారు.

ఈ చిత్రాన్ని త్రీ ఇడియట్స్, సూపర్ 30 తో పోలుస్తున్నారు కదా?

దీనికి, “త్రీ ఇడియట్స్కి” సంబంధమే లేదు. సూపర్ 30 అనేది బయోపిక్. ఆ కథ వేరు, ఇది వేరు. అది బయోపిక్, ఇది ఫిక్షనల్.

సార్ చిత్రానికి సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి ప్రశంసలు దక్కాయి?

త్రివిక్రమ్ గారు చాలా మంచి సినిమా చేశావు అన్నారు. శిరీష్ గారు, నితిన్, వరుణ్ తేజ్ ఇలా ఎందరో ఫోన్ చేసి ప్రశంసించారు.

మీ తదుపరి చిత్రం కూడా సితార బ్యానర్ లోనే ఉంటుందా?

నిర్మాత వంశీ నాకు చాలా మంచి స్నేహితుడు. త్రివిక్రమ్ గారంటే ప్రత్యేక అభిమానం ఉంటుంది. తదుపరి సినిమా గురించి ఇప్పుడే చెప్పలేను.

Advertisement
 

More

Related Stories