పెళ్లి చేసుకున్న వెంకీ

మరో యువ దర్శకుడు బ్రహ్మచారి జీవితానికి గుడ్ బై చెప్పాడు. యువ దర్శకుడు వెంకీ అట్లూరి ఎటువంటి హంగామా లేకుండా సైలెంట్ గా పెళ్లి చేసుకున్నాడు.

ఈ రోజు ఆయన పూజ అనే అమ్మాయిని పెళ్లాడాడు. ఈ పెళ్ళికి హీరో నితిన్, ఆయన భార్యతో కలిసి వెళ్ళాడు. ఇక హీరోయిన్ కీర్తి సురేష్, దర్శకుడు వెంకీ కుడుముల కూడా హాజరయ్యారు.

వెంకీ మొదట హీరోగా సినీ ప్రయాణం మొదలు పెట్టాడు. ఆ తర్వాత దర్శకుడిగా మారాడు. ‘తొలిప్రేమ’, ‘రంగ్ దే’, ‘మిస్టర్ మజ్ను’ వంటి సినిమాలు డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు ధనుష్ హీరోగా ‘సార్’ అనే సినిమా తీశాడు. అది తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 17న విడుదల కానుంది. ‘సార్’ సినిమా విడుదలకు ముందే పెళ్లి కార్యక్రమాన్ని పూర్తి చేశాడు.

త్వరలో హీరో శర్వానంద్, వరుణ్ తేజ్ కూడా పెళ్లికి రెడీ అవుతున్నారు.

 

More

Related Stories