
మామూలుగానే వెంకీ చాలా ఛిల్ అంటారు అంతా. మనిషి ఎంత క్యాజువల్ గా కనిపిస్తాడో మైండ్ సెట్ కూడా అంతే సింపుల్ అండ్ క్యాజువల్ గా ఉంటుందని.. అతడి గురించి తెలిసిన వాళ్లు అంటుంటారు. ఇప్పుడు తన అప్ కమింగ్ సినిమాల విషయంలో కూడా వెంకీ అంతే ఛిల్ గా ఉన్నాడు. లాక్ డౌన్ పరిస్థితుల నుంచి అందరూ బయటపడి తమ సినిమాల్ని సెట్స్ పైకి తీసుకొస్తుంటే.. వెంకీ మాత్రం ‘కూల్ గురు’ అంటున్నారు.
అవును.. ఇప్పటివరకు “నారప్ప” షూటింగ్ పై అప్ డేట్ లేదు. గమ్మత్తేంటంటే కనీసం గాసిప్ కూడా లేదు. “నారప్ప” తర్వాత “ఎఫ్3” చేయాలి. ఆ సినిమా సంగతి కూడా తెలియడం లేదు. ప్రస్తుతానికి చేతిలో ఉన్న సినిమాలివి.
ఇవి కంప్లీట్ చేసిన తర్వాత చేయాల్సిన సినిమాల లిస్ట్ చాలానే ఉంది. లిస్ట్ లో త్రివిక్రమ్, తరుణ్ భాస్కర్ లాంటి దర్శకులున్నారు. చేతిలో ఇంత లైనప్ పెట్టుకొని వెంకీ మాత్రం ఇంకా రిలాక్స్ మోడ్ లోనే ఉన్నాడు. ఇంట్లో నుంచి కాలు తీసి బయట పెట్టలేదు. ఈ నారప్ప ఎప్పటికి సెట్స్ పైకి వస్తాడో చూడాలి.