ఇలా మోసపోయానంటున్న వెంకీ

Venky Kudumula

దర్శకుడు వెంకీ కుడుములని ఒకతను మోసం చేశాడన్న వార్త నిజమే. ఇప్పటికే తెలుగుసినిమా.కామ్ ఈ వార్తను ప్రచురించింది. ‘చలో’, ‘భీష్మ’ వంటి సినిమాలు తీసి ఇప్పుడు మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి పెద్ద హీరోలతో చేద్దామని ఉబలాటపడుతున్న ఈ దర్శకుడు అంతా సిల్లీగా ఒకడి అకౌంట్ లో 60 వేలు ఎలా వేశాడు అనేదే అందరి డౌట్.

దానికి వెంకీ కుడుముల ఇప్పుడు సమాధానం ఇచ్చ్చాడు. జరిగింది ఇది అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు.

“తెలిసిన స్నేహితుడి ద్వారా నా నంబర్ సంపాదించాడు అనే నవీన్ అనే వ్యక్తి. భీష్మ సినిమాకు జాతీయ అవార్డు కోసం అప్లై చేద్దామంటూ ఫోన్ చేశాడు. సరే సేంద్రియ వ్యవసాయం కాన్సెప్ట్ నా కథలో ఉంది కాబట్టి దరఖాస్తు చేస్తే పోయేదేముంది అని నేను ఒప్పుకున్నా. అప్లికేషన్ ప్రాసెస్ కి 63,600 రూపాయలు ట్రాన్సఫర్ చెయ్యమంటే చేశాను. కానీ ఏమైందో ఏమో… ఆ డబ్బులు రాలేదని మరోసారి ట్రాన్స్ ఫర్ చెయ్యమని అడిగాడు అతను. అప్పుడు అనుమానం వచ్చి నా స్నేహితుడికి ఫోన్ చేశా. నవీన్ నీకు బాగా పరిచయమా అని అడిగాను. రెండేళ్ల నుంచి చాట్ చేస్తున్నా…కానీ పర్సనల్ గా ఎప్పుడూ కలవలేదు అన్నాడు. అప్పుడు అకౌంట్ డీటెయిల్స్ చూస్తే…సంస్థ పేరు మీద ఉండాల్సిన అకౌంట్ నంబర్ వ్యక్తిగత ఖాతా నంబర్ ఉంది. దాంతో ఇది చీటింగ్ కేసు అని అర్థమైంది.”

ఇది వెంకీ కుడుముల మోసపోయిన తీరు. చాలామంది మిత్రులు సైలెంట్ గా ఉండమని చెప్పారట. కానీ ఇది అందరికి తెలిస్తే… మోసం చేసేవాళ్ళు ఎలా ఉంటారో మిగతావాళ్ళకి కూడా తెలుస్తుందని తానే కేసు వేసినట్లు చెప్పుకొచ్చాడు.

కానీ వెంకీ కుడుముల చెప్తున్న వాటిలో కూడా కొన్ని లాజిక్కు లు మిస్ అయ్యాయి. జనం ట్రోలింగ్ చేస్తున్నారని వివరణ ఇచ్చినట్లుగా ఉంది.

More

Related Stories