‘నాట్యం’ అనే డ్యాన్స్ బేస్డ్ మూవీతో ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యారాజు నటిగా, నిర్మాతగా పరిచయం అవుతున్నారు. రేవంత్ కోరుకొండ దర్శకుడు. ఈ సినిమాలో తొలి సాంగ్ ‘నమః శివాయ’కు మంచి పేరు వచ్చింది.
తాజాగా రెండో పాటగా “పోనీ పోనీ” అనే సాగే గీతాన్ని విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు.
”సంధ్య నటించిన పోనీ పోనీ సాంగ్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఆమె చాలా చక్కగా డాన్స్ చేశారు. చూస్తుంటే నా ‘స్వర్ణ కమలం’ మళ్ళీ గుర్తొస్తోంది. అందమైన లొకేషన్స్‌లో ఎంతో అందంగా చిత్రీకరించారు. డాన్స్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా రాక చాలా రోజులైంది. చిత్ర యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్” అన్నారు వెంకటేష్.
“ఈ సాంగ్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఇది మా మూవీలో చాలా ముఖ్యమైన ఎమోషనల్ సాంగ్. స్వర్ణ కమలం మూవీ చూసి చూసి ఆ టేప్ అరిగిపోయి ఉంటుంది. ఈ సినిమాలో భాగమవడం ఓ ఆశిర్వాదంలా ఫీల్ అవుతున్నా. ఈ సినిమాలో భానుప్రియ గారు నా తల్లి పాత్రలో నటించారు. అలాగే ముఖ్యమైన సాంగ్ వెంకటేష్ లాంచ్ చేశారు. ఇవి నా జీవితంలో ఎప్పటికీ మరవలేని క్షణాలు” అన్నారు సంధ్యారాజు.