వెబ్ సిరీస్ ల్లోకి వెన్నెల కిశోర్!

Vennela Kishore

కమెడియన్ వెన్నెల కిషోర్… ఎక్కువగా వెబ్ సిరీస్ లు చూస్తుంటాడు. షూటింగ్ టైంలో గ్యాప్ దొరికితే “గేమ్ అఫ్ థ్రోన్స్” వంటి ఇంటర్ నేషనల్ వెబ్ డ్రామాలు చూస్తూ కనిపిస్తుంటాడు. కమెడియన్ గా తెలుగు సినిమాల్లో బిజీగా ఉన్న కిశోర్ … ఇప్పుడు వెబ్ సిరీస్ ల్లో కూడా నటించాలని అనుకుంటున్నాడట. ఇప్పటికే అతనికి ఒక మంచి ఆఫర్ వచ్చింది.

వెన్నెల కిశోరె ప్రధాన పాత్రలో ఒక వెబ్ సిరీస్ ని ప్లాన్ చేశారు ఒక యువ దర్శకుడు. ఐతే, కిశోర్ ఇంకా ఓకే చెప్పలేదు. లాక్డౌన్ తర్వాత అన్ని సినిమాల షూటింగ్ లు ఒకేసారి మొదలు కావడంతో డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేక ఇబ్బంది పడుతున్నాడు వెన్నెల కిశోర్. అందుకే.. వెబ్ సిరీస్ ఆఫర్ ని ఇంకా ఒప్పుకోలేదు.

కానీ డేట్స్ అడ్జెస్ట్ అయితే మాత్రం చేస్తాడట.

టాలీవుడ్ లో ఇప్పుడు అత్యధిక పారితోషికం తీసుకునే కమెడియన్… వెన్నెల కిశోర్. ఐతే, కిశోర్ కి కూడా సరైన పాత్ర పడి చాన్నాళ్లు అవుతోంది. ఒకే తీరు కామెడీ పాత్రలు వస్తున్నాయి. అతను కూడా మొనాటని బ్రేక్ చెయ్యాలి.

More

Related Stories