రవితేజ చిత్రంలో తొట్టెంపూడి వేణు


ఓ 20 ఏళ్ల క్రితం హీరోగా హల్ చల్ చేశారు తొట్టెంపూడి వేణు. ‘స్వయంవరం’, ‘చిరునవ్వుతో’, ‘దుర్గ’, ‘హనుమాన్ జంక్షన్’, ‘పెళ్ళాం ఊరెళ్తే’ వంటి సినిమాలతో వేణు తన సత్తా చాటారు అప్పట్లో. ఐతే, హీరోగా ఆయన కెరీర్ ఎక్కువ కాలం నిలవలేదు. ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ వైపు చూపు పడింది.

ఇంతకుముందే ‘దమ్ము’ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించారు వేణు. ఇప్పుడు రవితేజ నటిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే మూవీలో కూడా ఒక కీలక పాత్ర పోషించేందుకు అంగీకరించారు. ఇకపై క్యారెక్టర్ రోల్స్ ఎక్కువగా చేస్తారట.

వేణు వల్లే త్రివిక్రమ్ రచయితగా నిలదొక్కుకున్నారు. వేణు సక్సెస్ ఐతే తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో మంచి క్యారక్టర్ నటుడు దొరికినట్లే.

‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రానికి శరత్ మండవ దర్శకుడు. ‘మజిలీ’లో రెండో హీరోయిన్ గా నటించిన దివ్యంశ కౌశిక్ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్. మలయాళ భామ రజిషా మరో హీరోయిన్. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది.

 

More

Related Stories