సిటీ అదే, వెన్యూ మారింది!

Veera Simha Reddy


ఒంగోలు కాలేజ్ గ్రౌండ్స్ లో భారీ ఈవెంట్ కి ప్లాన్ చేసుకున్నారు ‘వీర సింహా రెడ్డి’ మేకర్స్. కానీ, చివరి నిమిషంలో ఒంగోలు పోలీసులు అనుమతి నిరాకరించారు. దాంతో, కంగారు పడింది టీం. ఇప్పటికిప్పుడు మరో సిటీకి ఈవెంట్ ని మార్చాలంటే ఎంతో వ్యయ, ప్రయాస. దాంతో, నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ టెన్షన్ పడింది. ఏమి చేసారో ఏమి కానీ మొత్తానికి పోలీసుల మనసు మారేలా చేసింది నిర్మాణ సంస్థ.

పోలీసులు కూడా దయ చూపి వెన్యూ మార్చితే ఒప్పుకున్నారు. ముందు ప్రకటించినట్లుగానే జనవరి 6న ఒంగోలులో ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. కానీ, ఇంతకుముందు ఒక కాలేజ్ గ్రౌండ్స్ లో అనుకున్న వేదికని మరో స్థలానికి మార్చారు. ఇక్కడైతే, ట్రాఫిక్ కి అంతరాయం కలగదని పోలీసులు అనుమతి ఇచ్చారట.

ఆ విధంగా కథ సుఖాంతం అయింది.

బాలయ్య హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని తీస్తున్న మూవీ ఇది. ఈ దర్శకుడు సొంత ప్రాంతం ఒంగోలు. కథకి కూడా ఇదే బ్యాక్డ్రాప్. అందుకే ఇక్కడ ఈవెంట్ నిర్వహించాలనుకున్నారు మేకర్స్.

 

More

Related Stories