- Advertisement -

కత్రిన కైఫ్ చాలా ఏళ్ళు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసింది. దాదాపు దశాబ్దం పాటు సాగిన వారి ప్రేమ బంధానికి రణబీర్ కపూర్ ఆమె జీవితంలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఎండ్ కార్డు పడింది. రణబీర్ కపూర్, కత్రిన కైఫ్ నాలుగేళ్ళ పాటు సీరియస్ గా ప్రేమలో మునిగి తేలారు. ఇక పెళ్లి చేసుకోవడమే ఆలస్యమనుకుంటున్న తరుణంలో బ్రేకప్ జరిగింది.
రీసెంట్ గా ఆమె మరో బాలీవుడ్ యువ హీరో విక్కీ కౌశల్ తో డేటింగ్ చేస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు విక్కీ మిత్రుడు హర్షవర్ధన్ కపూర్. ఇతను కూడా నటుడే, పైగా అనిల్ కపూర్ కొడుకు.
ఒక టీవీ టాక్ షోలో విక్కీ, కత్రిన డేటింగ్ అనేది 100 పర్సెంట్ నిజమని చెప్పాడు హర్షవర్ధన్ కపూర్. పెళ్లి గురించి తెలీదు కానీ డేటింగ్ నిజమేనట. ప్రస్తుతం కత్రిన వయసు 37 ఏళ్ళు.