
విద్యా బాలన్ ఒకప్పుడు అందచందాల ఆరబోతతో హీటెక్కించింది. ‘డర్టీపిక్చర్’ సినిమాలో సిల్క్ స్మిత పాత్రలో ఆమె చేసిన కవ్వింపులు అంతా ఇంతా కాదు. కానీ ఇప్పుడు విద్యా బాలన్ అలాంటి పాత్రలకు దూరమైంది.
ఆమె ఇప్పుడు వొళ్ళు కూడా చేసింది. వయసు పెరిగింది. దాంతో, మెచ్యూర్డ్ రోల్స్ చేస్తోంది. ఐతే, అప్పుడప్పుడు తన కొత్త ఫోటోషూట్ ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. మిగతా హీరోయిన్లు అందరూ కిరాకు ఫోటోలు షేర్ చేస్తుంటారు. కానీ, ఆమె మాత్రం సాధారణ పద్దతిలోనే చేస్తుంటుంది. విద్య హాట్ షూట్ లు ఎందుకు చెయ్యదు అనే డౌట్ ఒక అభిమానికి వచ్చింది.
అదే ప్రశ్నని ఆమెని అడిగాడు ఆ అభిమాని. ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో ఆమె చిట్ చాట్ చేస్తున్న సందర్భంలో ఈ ప్రశ్న ఆమెకి ఎదురైంది. దానికి ఆమె ఫన్నీగా సమాధానం ఇచ్చింది.
“It is hot, and I have been shooting. Tho hot photoshoot hee hua naa!” (ఇక్కడ వేడిగా ఉంది. నేనేమో షూటింగ్ లో ఉన్నాను. అంటే హాట్ ఫోటోషూట్ అయినట్లే కదా,” అని కొంటెగా సమాధానం ఇచ్చింది.