ఈసారి అన్నీ గోవాలోనే

Nayan and Vignesh

ప్రతి ఏటా ప్రియుడి పుట్టినరోజును విదేశాల్లో సెలబ్రేట్ చేయడం నయనతారకు అలవాటు. ఏటా ఈ టైమ్ కు నయన్-విఘ్నేష్ జంట విదేశాలకు చెక్కేస్తుంది. కానీ ఈసారి వీళ్ల డేటింగ్ కు కరోనా అడ్డుపడింది. దీంతో ఈ ఏడాది విఘ్నేష్ శివన్ పుట్టినరోజు (సెప్టెంబర్ 18) ఇండియాలోనే జరిగింది.

ఫారిన్ కు వెళ్లే ఛాన్స్ లేదు కాబట్టి ఈసారి ప్రియుడితో కలిసి గోవా చెక్కేసింది నయనతార. 4 రోజుల కిందటే గోవా వెళ్లిన ఈ బ్యూటీ.. ఈరోజు విఘ్నేష్ శివన్ పుట్టినరోజును అక్కడ సెలబ్రేట్ చేస్తోంది. ఈ మేరకు తాజాగా రిలీజ్ చేసిన ఓ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు రోజుల క్రితం నయనతార తల్లి బర్త్ డే కూడా గోవాలోని రిసార్ట్ లోనే సెలబ్రేట్ చేశారు.

కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు నయనతార-విఘ్నేష్. ఈ లాక్ డౌన్ లోనే వీళ్లు గుంభనంగా పెళ్లి చేసుకుంటారంటూ ఆమధ్య ప్రచారం జరిగింది. అయితే ఈ హాట్ కపుల్ మాత్రం పెళ్లికి అప్పుడే తొందరలేదన్నట్టు బిహేవ్ చేస్తోంది. కాకపోతే, ఆల్రెడీ ఎంగేజ్మెంట్ జరిగింది. ఎందుకంటే… నయనతార విగ్నేష్ ని తన “ఫియాన్స్” అని చెప్తోంది.

Related Stories