
నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న సినిమా వర్జిన్ స్టోరి. రుద్రమదేవి, రేసు గుర్రం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు విక్రమ్. దిల్ రాజు నిర్మిస్తున్న రౌడీ బాయ్స్ లో కీరోల్ ప్లే చేస్తున్నారు విక్రమ్.
విక్రమ్ హీరోగా చేస్తున్న సినిమా… వర్జిన్ స్టోరి. కొత్తగా రెక్కలొచ్చెనా..అనేది క్యాప్షన్. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రదీప్ బి అట్లూరి వర్జిన్ స్టోరి చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హీరో విక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది.
స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొని టీజర్ ను విడుదల చేశారు. .
“నాకు దర్శకుడు శేఖర్ కమ్ముల అంటే చాలా ఇష్టం. ఆయన హ్యాపీడేస్ చిత్రాన్ని నేనే ప్రొడ్యూస్ చేయాల్సింది. కుదరలేదు. గోదావరి సినిమా చూశాక శేఖర్ గారికి సన్మాన సభ పెట్టి సత్కరించాను. ఇవాళ మా అబ్బాయి మూవీ వర్జిన్ స్టోరి టీజర్ రిలీజ్ కు ఆయన రావడం సంతోషంగా ఉంది. వర్జిన్ స్టోరి ఒక నావెల్ స్టోరి. టీ20 సినిమా అని చెప్పొచ్చు,” అన్నారు లగడపాటి శ్రీధర్.