దర్శకుడిగా మారిన బిచ్చగాడు


బిచ్చగాడు అనే సినిమా హీరో విజయ్ ఆంటోని జాతకం మార్చేసింది. అతని కెరీర్ సంగీత దర్శకుడిగా మొదలైంది. ‘బిచ్చగాడు’ తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయం సాధించడంతో అతను కెరీర్ మలుపు తిరిగింది. ఆ తర్వాత హీరోగా అనేక చిత్రాలు చేసినా… మళ్ళీ అలాంటి హిట్ పడలేదు.

ఇప్పుడు, విజయం కోసం ‘బిచ్చగాడు’ సినిమాకి సీక్వెల్ మొదలుపెట్టారు విజయ్ ఆంటోని. ఈ సారి దర్శకుడు కూడా ఆయనే. ఈ మూవీతో దర్సకుడిగా ప్రయాణం మొదలు. ఇప్పటికే సంగీత దర్శకుడిగా, నిర్మాతగా, హీరోగా పరిచయమైన విజయ్ ఆంటోని నుంచి ఇప్పుడు ఈ కొత్త అవతారం.

ఈ రోజు విజయ్ ఆంటోని పుట్టిన రోజు. దాంతో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఐతే, కరోనా కాలం తర్వాత అనువాద చిత్రాల మార్కెట్ ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. కానీ అతను తనకి కలిసొచ్చిన సినిమానే నమ్ముకొని కొత్త ప్రస్థానం ప్రారంభించడం విశేషం

మరి ‘బిచ్చగాడు 2’ అతన్ని మళ్ళీ ట్రాక్ లోకి తెస్తుందా అనేది చూడాలి.

 

More

Related Stories