
హీరో విజయ్ విజయ్ దేవరకొండ తన తమ్ముడి మూవీని ప్రమోట్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఆనంద్ హీరోగా ‘పుష్పక విమానం’ సినిమా రూపొందింది. ఈ నెల 12న థియేటర్లోకి రానుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా తన తమ్ముడితో కలిసి ఒక వీడియో చేశారు.
విజయ్ గురించి అభిమానులకు ఉన్న డౌట్స్ అన్నిటికి ఈ వీడియోలో సమాధానం దొరుకుతుంది. కొన్ని కొంటె ప్రశ్నలకు కూడా సమాధానాలున్నాయి.
ఎవరితో అయినా లవ్ లో ఉన్నారా అన్న ప్రశ్నకు ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు విజయ్. “ఈ మధ్య హార్ట్‌బ్రేక్ అయింది. దాని గురించి ఎవరికీ తెలీదు. అందుకే కొంచెం బాధలో ఉన్నా,” అంటూ తెలివిగా సమాధానం ఇచ్చారు. ఇంతకీ అది ఒక అమ్మాయితో బ్రేకప్పా? ఇంకా ఏదైనా విషయమా? అన్నది చెప్పకుండా ఆన్సర్ ఇవ్వడం విశేషం.
అలాగే, తమ్ముడి సినిమా నచ్చింది అని చెప్పారు. “నేను ఒక సినిమా చూస్తున్నప్పుడు ఏం మాట్లాడను. రియాక్షన్ ఇవ్వను. అలా చూస్తూ పోతుంటా ‘పుష్పకవిమానం’ కూడా అలాగే చూశాను. ఫైనల్ కాపీ నాకు బాగా నచ్చింది.”
అభిమాన హీరోలు ఎవరు? “మహేష్ బాబుకి ఎప్పటినుంచో అభిమానిని. ఇక రనబీర్ కపూర్ కూడా ఇష్టం,” అని విజయ్ తెలిపారు.