దేవరకొండ, సుకుమార్ మూవీ వచ్చే ఏడాదే

దర్శకుడు సుకుమార్ ఇప్పటికే తన నెక్స్ట్ మూవీని ప్రకటించాడు. విజయ్ దేవరకొండ హీరోగా ఉంటుంది అని చెప్పాడు. కొత్త నిర్మాత తీసే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? అనేదే ప్రశ్న. సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. ఆగస్టు 13న రిలీజ్ చెయ్యాలనేది ప్లాన్. ఈ డేట్ మిస్ కావొద్దనే లక్ష్యంతోనే సుకుమార్ పని చేస్తున్నాడు.

ఇక విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ రూపొందిస్తోన్న బాక్సింగ్ డ్రామా ‘లైగర్’ సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఐతే, ‘లైగర్’, ‘పుష్ప’ సినిమాలు విడుదలయిన వెంటనే సుకుమార్ – దేవరకొండ సినిమా మొదలవుతుంది అనుకుంటే పొరపాటే. సుకుమార్ స్క్రిప్ట్ రాయడానికి ఎంత లేదన్నా ఆరు నెలల టైం తీసుకుంటాడు. ప్రీ-ప్రొడక్షన్ కి మరో మూడు నెలల టైం తీసుకుంటాడు. అంటే… వీరి సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో మొదలు కావొచ్చు.

ఈ గ్యాప్ లో దేవరకొండ శివ నిర్వాణ డైరెక్క్షన్లో మైత్రి మూవీ మేకర్స్ కి ఒక సినిమా పూర్తి చేసే అవకాశం ఉంది.

More

Related Stories