జాతీయస్థాయిలో రెండో స్థానం

- Advertisement -
Vijay Deverakonda

మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ 2020లో అందగాడు విజయ్ దేవరకొండకి మొదటి స్తానం దక్కింది. అది హైదరాబాద్ లిస్ట్. వరుసగా మూడు ఏళ్ళు మొదటి స్థానంలో నిలిచాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు హోల్ ఇండియాకి సంబందించిన లిస్ట్ కూడా వచ్చింది.

నేషనల్ లెవల్లో విజయ్ దేవరకొండ రెండో స్థానంలో నిలవడం విశేషం. జాతీయ స్థాయిలో మోస్ట్ డిజైరబుల్ మగాళ్లు వీళ్ళే అంటూ 50 మంది లిస్ట్ ని ప్రకటించింది టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇందులో గతేడాది చనిపోయిన సుశాంత్ సింగ్ రాజపుత్ కి మొదటి స్థానం దక్కగా, మన విజయ్ దేవరకొండకి రెండో స్థానం వచ్చింది.

అందగాళ్ళ లిస్ట్ లో ముందున్నాడు కానీ రెండేళ్లుగా ఒక్క సినిమా విడుదల చెయ్యలేదు ఈ కుర్ర హీరో. నెక్స్ట్ సినిమాతో హిట్ కొట్టాల్సిన పరిస్థితి. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘లైగర్’ సినిమా సగం పూర్తి అయింది.

 

More

Related Stories