యాడ్స్ సంపాదన మామూలుగా లేదు

- Advertisement -
Vijay Deverakonda


విజయ్ దేవరకొండ పాన్ ఇండియా హీరో కావాలన్న ప్రయత్నంలో భాగంగా ‘లైగర్’ సినిమా మొదలు పెట్టాడు. కానీ పాపం షూటింగ్ స్టార్ట్ అయిన నెల రోజులకే కరోనా మొదటి వేవ్ వచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ ముందుకు కదలడం లేదు. రెండేళ్లుగా ‘లైగర్’తోనే ఉండిపోయాడు. దాంతో సంపాదన తగ్గిపోయింది.

సినిమాల ద్వారా ఎర్నింగ్ తగ్గినా… వేరే విధంగా కవర్ చేస్తున్నాడు ఈ అందగాడు. నేషనల్ లెవల్లో పెద్ద బ్రాండ్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. మహేష్ బాబు తర్వాత తెలుగులో ఎక్కువ బ్రాండ్స్ తో డబ్బులు సంపాదిస్తున్న హీరో విజయ్ దేవరకొండ. మొన్నటివరకు ముంబైలో ఉండి నిన్నే హైదరాబాద్ కి వచ్చాడు విజయ్. రాగానే యాడ్ షూట్ స్టార్ట్ చేశాడు.

ఇంట్లోనే ఉండి పని మొదలు పెట్టాను అంటూ లేటెస్ట్ యాడ్ షూటింగ్ ఫోటోని షేర్ చేశాడు విజయ్ దేవరకొండ.

తెలుగులో బ్రాండ్స్ తో ఎక్కువ సంపాదిస్తున్న తారలు.. సమంత, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్, నాగ చైతన్య.

 

More

Related Stories