అదంతా అబద్ధం: విజయ్ దేవరకొండ

- Advertisement -
Vijay Deverakonda Rashmika

రష్మిక, తాను పెళ్లి చేసుకోబుతున్నట్లు మొదలైన గాసిప్స్ కి తెర దించాడు హీరో విజయ్ దేవరకొండ. అవి అబద్దమని తనదైన శైలిలో ట్విట్టర్లో పేర్కొన్నాడు. బూతు అర్థం వచ్చే విధంగా రాశాడు. గాసిప్స్ ని ఖండించేందుకు అలాంటి భాష ఉపయోగించడం అభ్యంతరకరం.

ఇక విషయానికి వస్తే… రష్మిక, తన పెళ్లి వార్తలు అంతా ఉత్తిదే అని తేల్చేశాడు.

‘గీత గోవిందం’ సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మిక మందాన కెమిస్ట్రీ చూసినప్పుడే వీరి మధ్య సంథింగ్ అని పుకార్లు వచ్చాయి. ‘డియర్ కామ్రేడ్’ చూశాక అవి మరింత ఊపందుకున్నాయి. దాంతో, విజయ్ దేవరకొండ, రష్మిక కొంత గ్యాప్ తీసుకున్నారు. ఇద్దరూ కలిసి నటించకూడదని డిసైడ్ అయ్యారు. రష్మిక ‘భీష్మ’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘పుష్ప’… ఇలా వరుస విజయాలతో బిజీ అయిపోయింది. దాంతో, విజయ్, రష్మికల గురించి పుకార్లు ఆగిపోయాయి.

ఐతే, సడెన్ గా ఇప్పుడు వీరి డేటింగ్ గురించి, పెళ్లి గురించి మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఎందుకంటే, విజయ్ ఇప్పుడు ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నారు. ముంబైలో రష్మిక, విజయ్ దేవరకొండ చెట్టాపట్టాలేసుకోని రెస్టారెంట్ లో డిన్నర్ చేయడాలు కెమెరా కంటికి చిక్కాయి. దాంతో, వీరి పెళ్లి గురించి రూమర్స్ మొదలయ్యాయి

ప్రస్తుతం ఇద్దరూ కెరియర్ పరంగా సూపర్ గా దూసుకెళ్తున్నారు. ‘పుష్ప’ భారీ హిట్ తో రష్మిక హిందీలో పాపులర్ అయింది. ఆమె హిందీలో నటించిన ‘మిషన్ మజ్ను’, ‘గుడ్ బై’ చిత్రాలు ఈ ఏడాదే విడుదల కానున్నాయి. ‘పుష్ప 2’ మొదలు కానుంది. ఇక తెలుగులో శర్వానంద్ సరసన నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మార్చి 4న రిలీజ్ కానుంది.

విజయ్ దేవరకొండ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ‘లైగర్’ పూర్తి చేశారు. నెక్స్ట్, పూరి డైరెక్షన్ లో ‘జన గణ మన’, శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక మూవీ సెట్స్ పైకి తీసుకెళ్తారు.

More

Related Stories