ముంబైలో క్రేజ్ అదుర్స్

Liger

విజయ్ దేవరకొండ కాబోయే పెద్ద సూపర్ స్టార్ అని ఇటీవలే పూరి ప్రకటించారు. ఆయన కాన్ఫిడెన్స్ కి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఐతే, ముంబైలో విజయ్ దేవరకొండకి ఉన్న క్రేజ్ చూస్తేంటే ఆయన మాట నమ్మక తప్పదు.

ఇటీవల ముంబైలో ‘లైగర్’ ట్రైలర్ విడుదల చేశారు. ఇక్కడి సుదర్శన్ థియేటర్ లో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ముంబైలోని సినీపోలీస్ మల్టిప్లెక్స్ లో కూడా అదే రెస్పాన్స్.

ఈవెంట్ అయ్యాక కూడా ఫ్యాన్స్ విజయ్ ను ఫాలో చేస్తూనే ఉన్నారట. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విజయ్ కూడా అభిమానులందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి గ్రీట్ చెయ్యడం విశేషం.

అతనికి అక్కడ ఉన్న క్రేజ్ చూస్తుంటే… ఈ పాన్ ఇండియా చిత్రానికి భారీ ఓపెనింగ్ వచ్చేలా ఉంది.

విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే కథానాయిక గా నటిస్తున్న ఈ మూవీ ఒక బాక్సింగ్ డ్రామా. లెజెండ్ మైక్ టైసన్ కూడా నటిస్తుండడం ఒక ఆకర్షణ. ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది ‘లైగర్’.

 

More

Related Stories