
విజయ్ దేవరకొండకి ఎలాంటి చెడు అలవాట్లు లేవు అని చెప్తోంది సమంత. అతను మందు తాగడు. ఈ విషయం తెలుసుకొని నేను ఆశ్చర్యపోయాను. “పార్టీలకు వస్తాడు. పార్టీల్లో కూర్చుంటాడు. కానీ తాను మందు తీసుకోడు. ప్రతిరోజూ జిమ్ చేస్తాడు. క్రమశిక్షణగా ఉంటాడు,” అని సమంత విజయ్ గురించి కొన్ని విషయాలు బయట పెట్టింది.
విజయ్ పెళ్లి కూడా త్వరలోనే అవుతుంది అని కూడా తెలిపింది. విజయ్ పెళ్లి గురించి సమంతకి పూర్తి సమాచారం ఉంది.
విజయ్ దేవరకొండ, సమంత ఇంతకుముందు “మహానటి”లో నటించారు. ఆ సినిమాలో వారి మధ్య డ్యూయెట్లు, రొమాన్స్ అంటూ ఏమి లేదు. ఒక జంటగా మాత్రం “ఖుషి”లో నటించారు. ఈ షూటింగ్ దాదాపు ఏడాదిన్నర పాటు సాగింది. మధ్యలో సమంతకి అనారోగ్యం వల్ల ఆగింది.
సమంతకి ఇప్పుడు విజయ్ మంచి మిత్రుడు అయ్యాడు. సో, విజయ్ పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరో కూడా సమంతకు తెలుసు. కానీ ఆ విషయాన్నీ మాత్రం బయటపెట్టలేదు.