- Advertisement -

విజయ్ దేవరకొండకి ఫిమేల్ ఫాలోయింగ్ ఎక్కువ. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కేరళ అనే తేడా లేదు… అన్ని చోట్లా లేడీ అభిమానులు ఫుల్లుగా ఉన్నారు. చాలా మంది హీరోయిన్లకు కూడా అతను డ్రీం మేన్. బాలీవుడ్ లో కూడా ఇదే ట్రెండు ఉండడం విచిత్రమే. విజయ్ దేవరకొండ ఇంకా బాలీవుడ్ లో ప్రూవ్ చేసుకోలేదు. “లైగర్” అనే సినిమాతో బాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. అదింకా షూటింగ్ దశలోనే ఉంది.
కానీ కియారా అద్వానీ, జాన్వీ కపూర్, అనన్య పాండే, ఆలియా భట్, సారా అలీ ఖాన్ … వీరందరూ అతనికి ఫిదా అయిపోయారు. దేవరకొండ నటనకి తాము ఫిదా అయిపోయామని ఈ భామలు చెప్తున్నారు. ఆ రేంజు పాపులారిటీ పొందాడు విజయ్.
ఒకవేళ ‘లైగర్’ హిందీ మార్కెట్ లో విజయం సాధిస్తే అతని క్రేజ్ మరింతగా పెరుగుతుందనడంలో సందేహం లేదు.