
ఏడాది కాలంగా నిరీక్షించిన విజయ్ దేవరకొండకి ఆ క్షణం రానే వచ్చింది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ తో కలిసి ఫైట్ చేయన్నారు విజయ్ దేవరకొండ. ఇప్పుడు అమెరికాలో ల్యాండ్ అయింది ‘లైగర్’ టీం. అమెరికాలో మైక్ టైసన్, విజయ్ దేవరకొండపై కీలక సన్నివేశాలు తీస్తారు. ఈ సినిమా షూటింగ్ గతేడాది జనవరి (2020)లో మొదలు అయింది. 22 నెలల తర్వాత షూటింగ్ చివరి దశకు చేరుకొంది.
మైక్ టైసన్ ని ఒప్పించేందుకు చాలా టైం పట్టింది. ఆ తర్వాత అమెరికాలో షూటింగ్ కి పర్మిషన్ కోసం వెయిట్ చెయ్యాల్సి వచ్చింది. సాధారణంగా దర్శకుడు పూరి జగన్నాధ్ ఎంత పెద్ద హీరోతో సినిమా అయినా ఆరు నెలల్లో పూర్తి చేస్తారు. ‘పోకిరి’లాంటి సెన్సేషనల్ హిట్ సినిమాని కూడా అలాగే తీశారు. కానీ కరోనా కారణంగా ‘లైగర్’ సినిమాపై ఆయన రెండేళ్ల టైంని ఫోకస్ పెట్టాల్సి వస్తోంది.
విజయ్ దేవరకొండ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా ఆడడం ముఖ్యం. ఆడితే… ఆయన టాప్ హీరోల జాబితాలోకి చేరిపోతారు. ఆడకపోతే, పాన్ ఇండియా సంగతి దేవుడెరుగు తెలుగులోనే ఆయన స్థానం కిందికి పోతుంది. ఐతే, “ఆగ్ లగా దేంగే” అంటూ కాన్ఫిడెంట్ గా ఉన్నారు దేవరకొండ.
‘లైగర్’ సినిమాని పూరి జగన్నాధ్, కరణ్ జోహర్ కలిసి నిర్మిస్తున్నారు. హిందీ మార్కెట్ పై భారీ అంచనాలున్నాయి.