- Advertisement -

స్టేజ్ పైకొస్తే “వాట్సాప్..వాట్సాప్..రౌడీస్” అంటూ రెచ్చిపోయే విజయ్ దేవరకొండకు అంత సీన్ లేదంటున్నాడు అతడి బెస్ట్ ఫ్రెండ్ ప్రియదర్శి. కేవలం అదంతా తెచ్చిపెట్టుకుంటాడని, విజయ్ దేవరకొండ చాలా ఇంట్రోవర్ట్ (అంతర్ముఖుడు) అని చెబుతున్నాడు.
నలుగురిలో కలవడం విజయ్ దేవరకొండకు తెలియదంట. పబ్లిక్ లో కలవడానికి ఈ హీరో అస్సలు ఇష్టపడడని, ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసంటున్నాడు ప్రియదర్శి. దాన్ని సిగ్గని చెప్పలేం కానీ బాగా మొహమాటపడతాడు.
“అర్జున్ రెడ్డి” సినిమా కెరీర్ పరంగానే కాకుండా.. వ్యక్తిగతంగా కూడా విజయ్ దేవరకొండను మార్చిందంటున్నాడు ప్రియదర్శి. కాస్త రెబల్ గా, ఔట్-స్పోకెన్ గా కనిపించడానికి ప్రయత్నిస్తున్నాడని.. కానీ ఇప్పటికీ ఎక్కువమంది క్రౌడ్ ఉంటే ఇబ్బంది పడతాడని చెప్పుకొచ్చాడు ప్రియదర్శి.