
అమెరికా నుంచి హైదరాబాద్ కి వచ్చేశాడు హీరో విజయ్ దేవరకొండ. ‘లైగర్’ సినిమా కోసం గత నెల 11న అమెరికా వెళ్ళాడు విజయ్. దాదాపు 25 రోజుల పాటు షూటింగ్లో పాల్గొని హైదరాబాద్ కి వచ్చింది ‘లైగర్ మూవీ టీం. అమెరికాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ తో కలిసి నటించాడు విజయ్ దేవరకొండ. టైసన్ కి ఇదే మొదటి భారతీయ చిత్రం.
మైక్ టైసన్ పలు హాలీవుడ్ మూవీస్ లో ఇంతకుముందు యాక్ట్ చేశారు. కానీ ఒక భారతీయ సినిమాలో నటించేందుకు ఆయన ఒప్పుకోవడం ఒక సెన్సేషన్. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ టీం టైసన్ ని ఏడాదిపాటు చర్చలు జరిపి ఒప్పించిందంట.
ఇక విజయ్ దేవరకొండ మిగిలిన మిగతా భాగాన్ని హైదరాబాద్, ముంబైలలో పూర్తి చేస్తారు. రెండు నెలల్లో ఈ సినిమాకి గుమ్మడికాయ కొడుతారట. ఆ తర్వాత రిలీజ్ ఎప్పుడు అనేది నిర్ణయిస్తారు.
విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రం ఏంటి అనేది ఇంకా ప్రకటించలేదు. శివ నిర్వాణ, సుకుమార్ తో సినిమాలు అని రెండేళ్ల క్రితం చెప్పాడు విజయ్. ఐతే, ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి. మరి నెక్స్ట్ మూవీ ఏ దర్శకుడితో ఉంటుంది అనేది చూడాలి.