ఆల్మోస్ట్ పెళ్లి అయినట్లే

- Advertisement -
Janhvikapoor Stills 26 10 22 005

విజయ్ దేవరకొండ బ్రహ్మచారి. ఇంకా పెళ్లి కాలేదు. కానీ, విజయ్ దేవరకొండ ఒక కమిటెడ్ రిలేషన్ షిప్ లో ఉన్నాడని అంటోంది హీరోయిన్ జాన్వీ కపూర్. అతనికి పెళ్లి కాకున్నా పెళ్లి ఆల్మోస్ట్ అయినవాడిగానే పరిగణించాలి అని చెప్తోంది.

స్వయంవరం నిర్వహించాల్సి వస్తే ఏ ముగ్గురు హీరోలను కోరుకుంటావు అని జాన్వీని ప్రశ్నిస్తే… రణబీర్ కపూర్, టైగర్ శ్రోప్, హృతిక్ రోషన్ అని ఠక్కున సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత రణబీర్ కి పెళ్లి అయింది కదా అని అతని పేరుని కొట్టేసింది. రణబీర్ స్థానంలో ఇంకో పేరు గురించి ఆమె ఆలోచిస్తుండగా యాంకర్ విజయ్ దేవరకొండ పేరుని సజెస్ట్ చేశారు. ఐతే, ఆయనకి కూడా ఆల్మోస్ట్ పెళ్లి అయిపోయినట్లే కాబట్టి అతన్ని కూడా కన్సిడర్ చేయలేమని చెప్పింది.

ఇన్ డైరెక్ట్ గా విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి గురించే ఆమె చెప్పింది అని బాలీవుడ్ మీడియా కోడైకూస్తోంది.

Vijay Deverakonda and Rashmika

విజయ్ దేవరకొండ, రష్మిక ఇటీవల కలిసి మాల్దీవుల వెకేషన్ కి వెళ్లడంతో వీరి రిలేషన్ షిప్ గురించి, వీరి పెళ్లి గురించి జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. జాన్వీ కపూర్ కి విజయ్ దేవరకొండ అంటే చాలా అభిమానం. ఆమె కరణ్ జోహార్ క్యాంప్ హీరోయిన్. సో, ఆమె విజయ్ దేవరకొండ పెళ్లి ప్లాన్స్ గురించి, అతని గాళ్ ఫ్రెండ్ గురించి ఆమెకి కచ్చితమైన సమాచారం ఉండే ఉండాలి.

More

Related Stories