
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కశ్మీర్ లో మొదలు పెట్టారు. సరిగ్గా నెల రోజుల పాటు ఫస్ట్ షెడ్యూల్ చేశారు. ఇందులోనే చాలా కీలకమైన సన్నివేశాల్ని షూట్ చేశారు. పనిలో పనిగా టైటిల్ కూడా ప్రకటించారు. హీరోహీరోయిన్ల ఫస్ట్ లుక్స్ కూడా విడుదల చేశారు. ఇలా సెట్స్ పైకొచ్చిన మొదటి రోజు నుంచే హంగామా చేస్తోంది దేవరకొండ సినిమా.
ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ త్వరలోనే హైదరాబాద్ లో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వైజాగ్, అలెప్పి లో మరో షెడ్యూల్ ప్లాన్ చేశారు. పక్కా ప్లానింగ్ తో షూటింగ్ కంప్లీట్ చేసి డిసెంబర్ 23న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. తెలుగుతో పాటు సౌత్ లోని అన్ని భాషల్లో ఒకేసారి ఈ సినిమా విడుదల కాబోతోంది.
హిషామ్ వాహబ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లో భాగంగా ఇతడు కంపోజ్ చేసిన ఖుషి బిట్ సాంగ్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది.