దేవరకొండ డేర్, అమ్మాయిల జోరు!

విజయ్ దేవరకొండ ఒక్క పోస్టర్ తో సంచలనం రేపాడు. ఆల్మోస్ట్ నగ్నంగా ఒక ఫోజు ఇచ్చాడు ‘లైగర్’ ప్రొమోషన్ కోసం. కొందరు ట్రోల్ చేశారు. కానీ, ఎక్కువమంది పాజిటివ్ గానో, నెగెటివ్ గానో స్పందించారు. అందరూ ఈ పోస్టర్ పై లుక్కేశారు. ‘లైగర్’ టీం అనుకున్నది సాధించింది.

ఐతే, నెగెటివ్ కూడా ఎక్కువ లేదు. అమ్మాయిలు ఎక్కువగా స్పందించారు. దీన్ని బట్టే అర్థం అవుతోంది దేవరకొండ మేజిక్.

విజయ్ దేవరకొండకి అమ్మాయిలలో ఎక్కువ అభిమానులు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ పోస్టర్ ని తమ సోయిలే మీడియా హ్యాండిల్స్ డీపీగా మార్చుకోవడం విశేషం. కొందరు మరో అడుగు వేసి తమ పేరు వెనుక దేవరకొండ అంటూ జోడించారు.

‘లైగర్’ సినిమా విజయ్ దేవరకొండకి చాలా కీలకం. ఎందుకంటే ఇది మొదటి పాన్ ఇండియా చిత్రం అతనికి. ఈ సినిమా బిజినెస్ కూడా బాగా జరిగింది. దానికి తగ్గట్లు ఓపెనింగ్స్ రావాలి. ఇప్పుడు మొదలైన ప్రచార హంగామా ఇంకా ఊపందుకుంటుంది.

 

More

Related Stories