
విజయ్ దేవరకొండ అమ్మాయిలకు ఫెవరేట్. తన డాషింగ్, హ్యాండ్సమ్ లుక్స్ తో అమ్మాయిల మనసు దోచుకున్నాడు. అతని వయసు, అతని అందం బట్టి విజయ్ దేవరకొండ లవర్ రోల్స్ వెయ్యాలి. కానీ, ఎందుకో విజయ్ దేవరకొండ ‘లవర్ బాయ్’గా కన్నా ‘హబ్బీ’గా పేరు తెచుకోవాలనుకుంటున్నాడు.
వరుసగా ‘భర్త’ పాత్రలు పోషిస్తున్నాడు.
‘ఖుషి’ సినిమాలో సమంతకి హబ్బీగా నటించాడు. కొత్తగా పెళ్ళైన జంట పడే తిప్పలు ఆ సినిమాలో చూపించారు. ఇక సంక్రాంతికి ‘ఫ్యామిలీ స్టార్’గా రానున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో కూడా లవర్ గా కాకుండా హజ్బెండ్ గానే దర్శనమిస్తాడు.
ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ కి భర్తగా నటించాడు. తాజాగా విడుదలైన వీడియో టీజర్ లో మృణాల్ విజయ్ దేవరకొండని “ఏవండీ” అని పిలిచే సీన్ ఉంది. వీరిద్దరూ భార్యాభర్తలుగా నటిస్తున్నట్లు ఆ టీజర్ ని బట్టి అర్థమైంది.
ALSO CHECK: A glimpse of Vijay Deverakonda as ‘Family Star’