- Advertisement -

విజయ్ దేవరకొండకి పాములంటే చచ్చే భయం. అయినా మెళ్ళో కొండ చిలువని వేసుకొని ఫోటోకి ఫోజు ఇచ్చాడు. సినిమా కోసం కాదు. నిజ జీవితంలోనే ఇలా చేశాడు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉన్న ఒక ప్రైవేట్ జూకి విజయ్ తన కుటుంబంతో కలిసి వెళ్ళాడు. అక్కడ పులితో తాడు లాగే ఆటాడాడు. ఈ ఆటలో పులినే నెగ్గింది. విజయ్ ఓడిపోయాడు. ఇక బుల్లి చిరుతని తన వొళ్ళో కూర్చుండబెట్టుకొని దాని తల నిమిరాడు.
జీవితంలో ఇలాంటి సాహసకృత్యాలు కూడా పూర్తి చేశానని గర్వంగా ఈ వీడియో తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు విజయ్ దేవరకొండ. ఆ వీడియోని ఇక్కడ చూడండి.
మరోవైపు, విజయ్ కొత్త సినిమాలు రెండు ఇటీవలే ప్రకటించారు. ‘ఖుషి’ సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఈ రెండు కొత్త సినిమాలను ఒక దాని తర్వాత ఒకటి మొదలుపెడతాడు.