ఉన్నదాన్ని చెడగొట్టకు!

Vijay Deverakonda

“దేవుడా నువ్వు కొత్తగా లైఫ్ లో బ్రేకులు ఇవ్వాల్సిన పని లేదు ఉన్నదాన్ని మాత్రం చెడగొట్టకు” అనే డైలాగ్ తో విజయ్ దేవరకొండ నటించిన “ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ మొదలవుతుంది. ఈ డైలాగ్ ని తన గురించే పెట్టుకున్నాడా అని సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి.

Advertisement

“అర్జున్ రెడ్డి” సినిమా తర్వాత విజయ్ దేవరకొండకి యూత్ లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ సినిమా తర్వాత అనేక ఫ్లాపులు వచ్చినా “లైగర్” విడుదలకు ముందు విజయ్ చాలా హైప్ క్రియేట్ చేశాడు ఆ సినిమాకి. దాంతో భారీ ఓపెనింగ్ వచ్చింది. కానీ సినిమాకి వెళ్లిన వాళ్ళు దాన్ని చూసి షాక్ తిన్నారు. అది ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది.

ఆ తర్వాత మళ్ళీ విజయ్ కి పెద్ద హిట్ రాలేదు. బహుశా తన గురించే దేవుడిని ఈ సినిమాలో డైలాగ్ ద్వారా కోరుకున్నట్లు ఉంది అని జనాలు కామెంట్ చేస్తున్నారు.

“ఫ్యామిలీ స్టార్”తోనైనా విజయ్ భారీ హిట్ అందుకుంటాడా అనేది చూడాలి. ఈ సినిమాకి ఇంకా హైప్ పెరగలేదు.

Family Star Trailer - Vijay Deverakonda | Mrunal | Parasuram | Dil Raju | Gopi Sundar
Advertisement
 

More

Related Stories