ఇండస్ట్రీ రాజకీయాలు తెలుసుకొన్నాడట

Confusion over Vijay Deverakonda’s next two films

సినిమా ఇండస్ట్రీ బిజినెస్, ఇక్కడ ఉండే రాజకీయాల గురించి బాగా తెలిసొచ్చిందంటున్నాడు హీరో విజయ్ దేవరకొండ.. అలాగే ఈ లాక్ డౌన్ టైమ్ లో ఏం చేశాడో స్వయంగా చెప్పుకొచ్చాడు.. ఆ విశేషాలు బ్రీఫ్ గా…

“డియర్ కామ్రేడ్” చాలా ఎఫెక్ట్ చూపించింది. అది సరిగ్గా ఆడలేదు. దీనికి తోడు సోషల్ మీడియాలో చాలా నెగెటివ్ టాక్ నడిచింది. ఆ సినిమాపై చాలా వ్యాపారం నడిచింది. వీటిలో దేనికీ నేను అప్పటికి మెంటల్లీ ప్రిపేర్ అయి లేను. ఈ సినిమాతో మూవీ బిజినెస్ ఎలా ఉంటుందో తెలిసొచ్చింది. పరిశ్రమలో రాజకీయాలు ఎలా ఉంటాయో అర్థమైంది. అవి నన్ను అప్పట్లో ప్రభావితం చేశాయి. కానీ దాన్నుంచి తొందరగానే బయటపడ్డాను.

“డియర్ కామ్రేడ్” ఫెయిల్యూర్ తో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. అందులో మొదటిది ఏంటంటే.. రివ్యూస్ అనే సెగ్మెంట్ ను తలకు ఎక్కించుకోకూడదని డిసైడ్ అయ్యాను. నాకు, ప్రేక్షకులకు మధ్య రివ్యూవర్ ఉన్నాడనే విషయాన్ని మరిచిపోవాలనుకుంటున్నాను. వాళ్లు సింగిల్ స్టార్ ఇచ్చినా, నాలుగు స్టార్స్ ఇచ్చినా పట్టించుకోను. ప్రేక్షకుడు ఎంటర్ టైన్ అయ్యాడా లేడా అనేదే చూస్తాను. కేవలం ఇదే మైండ్ సెట్ తో పూరి జగన్నాథ్ “ఫైటర్”ను సెలక్ట్ చేసుకున్నాను. మరో రెండు సినిమాలు కూడా ఇదే మైండ్ సెట్ తో నిర్ణయం తీసుకున్నాను.

Ananya, VD and Puri

పూరి జగన్నాధ్ మూవీ కోసం.. ఓ ఫైటర్ లా తయారవ్వడం కోసం ప్రయత్నించాను. దాన్ని సాధించాను. దాని కోసం 8 నెలలు కష్టపడ్డాను. అది సిక్స్ ప్యాక్ లేదా ఎయిట్ ప్యాక్ అని నేను చెప్పను. ఎదుటి వ్యక్తిని కొడితే నిజమే అనిపించేలాంటి ఫిజిక్ మాత్రం సాధించాను. దాని కోసమే లాక్ డౌన్ లో కూడా కష్టపడ్డాను.

నా కెరీర్ లో ఫుల్ లెంగ్త్ కమర్షియల్ సినిమా “ఫైటర్”. అలా అని ఇదేదో నా స్టయిల్ కు దూరంగా ఉండదు. నా యాటిట్యూట్ కూడా కనిపిస్తుంది. ఇదొక టిపికల్ కమర్షియల్ సినిమా అనుకోవచ్చు.

లాక్ డౌన్ కాబట్టి జుట్టు అలా పెంచుతూ వదిలేశాను. అంతేతప్ప సినిమాకు, ఈ హెయిర్ కు సంబంధం లేదు. ఒక్కోసారి చిరాగ్గా ఉంటోంది, ఇంకోసారి నా కళ్లకు అడ్డం పడుతోంది. తింటుంటే నోట్లోకి కూడా వచ్చేస్తోంది. కానీ భరిస్తున్నాను.

ఈ లాక్ డౌన్ టైమ్ లో ఓ ప్రొడ్యూసర్ గా కథలు వింటున్నాను. ఓ హీరోగా ఎలాంటి కథలు వినడం లేదు, స్క్రిప్టులు చదవడం లేదు.

Advertisement
 

More

Related Stories