దేవుడు తథాస్తు అన్నాడట!

ఎప్పుడూ పనిలో ఉండే విజయ్ దేవరకొండ రెస్ట్ దొరికితే బావుండు అని చాలాసార్లు ఫీల్ అయ్యాడట. తన ఫ్రెండ్స్ దగ్గర ఎప్పుడూ ఇదే విషయం చెప్పేవాడట. ఓ ఏడాది రెస్ట్ తీసుకుంటానని, ఓ మూడేళ్ల తర్వాత సినిమాలు ఆపేస్తానని అనేవాడట. బహుశా ఈ మాటలు దేవుడు విన్నాడేమో.. తనకు ఏడాది పాటు పనిలేకుండా చేశాడని చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ.

లాక్ డౌన్ వచ్చి తనకు వద్దన్నా రెస్ట్ దొరికిందని చెబుతున్నాడు ఈ హీరో. మొదటి 2 నెలలు బాగా ఆనందంగా ఉన్నానని, ఫుల్ గా ఎంజాయ్ చేశానని, మూడో నెల నుంచి బోర్ కొట్టడం స్టార్ట్ అయిందని చెబుతున్నాడు.

అంతేకాదు.. ఈ లాక్ డౌన్ వల్ల తన కెరీర్ లో చాలా టైమ్, డబ్బు వేస్ట్ అయిపోయాయని అంటున్నాడు. ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్దామా అని ఆశగా ఎదురుచూస్తున్నాడట విజయ్ దేవరకొండ.

రీసెంట్ గా వెళ్లిన యూరోప్ ట్రిప్ పై కూడా స్పందించాడు. కేవలం తన బోర్ డమ్ ను పోగొట్టుకునేందుకు, కాస్త రిఫ్రెష్ అయ్యేందుకు మాత్రమే యూరోప్ వెళ్లానని, అంతకుమించి ఆ ట్రిప్ లో మర్మం లేదని చెప్పుకొచ్చాడు. అయితే ఇకపై ఏ విషయాన్నీ పదేపదే అనుకోనని, దేవుడు తథాస్తు అనేస్తాడేమో అనే భయం పట్టుకుందంటున్నాడు.

పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో నటిస్తున్నాడిప్పుడు. ఈ సినిమా 40 శాతం పూర్తి అయింది. లాక్డౌన్ తర్వాత ఇంకా షూటింగ్ స్టార్ట్ చెయ్యలేదు.

Related Stories