
విజయ్ దేవరకొండ సడెన్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యాడు. వరుసగా పోస్టులు పెడుతున్నాడు. ప్రస్తుతం ఈ అందమైన హీరో కాశ్మీర్ లో బిజీగా ఉన్నాడు. అక్కడే షూటింగ్ జరుగుతోంది. దర్శకుడు శివ నిర్వాణ తీస్తున్న లవ్ స్టోరీలో నటిస్తున్నాడు. సమంత హీరోయిన్. కాశ్మీర్ లో పేరొందిన దాల్ లేక్ లో బోట్ షికారు చేస్తున్న ఒక వీడియోని తాజాగా షేర్ చేశాడు విజయ్ దేవరకొండ.
పనిలో పనిగా తన రెండు సినిమాల గురించి రెండు ముక్కల్లో విషయం చెప్పాడు. “లైగర్ నా కెరియర్ లో అతిపెద్ద చిత్రం. #VD11 (ఇంకా పేరు పెట్టని చిత్రం) నా కెరియర్లో ఒక అందమైన ప్రేమకథ,” అని త్వరలో రాబోయే రెండు చిత్రాల గురించి పోస్ట్ చేశాడు.
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన బాక్సింగ్ డ్రామా… లైగర్. షూటింగ్ పూర్తి చేసుకొంది. ఈ ఆగస్టులో విడుదల. ఇక శివ నిర్వాణ తీస్తున్న లవ్ స్టోరీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానుంది.
ఈ రెండు అవగానే మళ్ళీ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లోనే ‘జేజిఎం’ (జన గణ మన) చిత్రం షూటింగ్ మొదలు పెడుతాడు.