విజయ్ తో మరో సినిమా!

Vijay Deverakonda

విజయ్ దేవరకొండ పేరు పోగొట్టింది ‘లైగర్’. పారితోషికం పరంగా కూడా విజయ్ కి ఆ సినిమా నష్టమే. సినిమా విడుదల తర్వాత తీసుకుందామని చాలా తక్కువ మొత్తమే అడ్వాన్స్ గా తీసుకున్నాడట. ఇప్పుడు సినిమా పోవడంతో… ఆ డబ్బులు కూడా గోవిందా.

పూరికి, విజయ్ కి మధ్య ఇప్పుడు మాటల్లేవు. మాట్లాడుకోవడాల్లేవు. మరి, ‘లైగర్’ని హిందీలో ప్రెజెంట్ చేసి ఎంతో హడావిడి చేసిన కరణ్ జోహార్ తో బంధాలు ఎలా ఉన్నాయి? కరణ్ జోహార్, పూరి మధ్య రిలేషన్స్ కట్. కానీ, విజయ్ దేవరకొండ, కరణ్ మధ్య మాత్రం అదే స్నేహం ఉందట.

బాలీవుడ్ లో తాను సరిగా లాంచ్ చెయ్యలేకపోయాను అనే ఉద్దేశంతో విజయ్ దేవరకొండకి మరో మంచి ప్రాజెక్ట్ సెట్ చేస్తానని అంటున్నారట కరణ్ జోహార్.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత మరో తెలుగు సినిమా కూడా చేసి, ఆ తర్వాత కరణ్ జోహార్ ప్లాన్ చేసే మూవీలో నటిస్తాడట. విజయ్ దేవరకొండని హిందీలో లవర్ బాయ్ గా ప్రెజెంట్ చేద్దామని భావిస్తున్నాడు కరణ్ జోహార్.

 

More

Related Stories