విజయ్ దేవరకొండతోనే ఇంకోటి!

- Advertisement -


విజయ్ దేవరకొండ తన కెరీర్ లో కీలకమైన రెండు ఏళ్ళు వేస్ట్ చేసుకున్నాడు. కరోనా కారణంగా “లైగర్” సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అయింది. 2020 జనవరిలో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. 2022 ఆగస్టులో విడుదల కానుంది. హీరోగా ఎంతో పాపులారిటీ పొందిన ఒక యువ హీరో ఒక సినిమాతో రెండేళ్ళకి పైగా డివోట్ కావడం మనీ లెక్కల పరంగా తప్పు.

రెండేళ్లలో మూడు సినిమాలు చేసుకుంటే బోలేడంతా వెనకేసుకునేవాడు. ఐతే, విజయ దేవరకొండ ఈ సినిమాపై చాలా ధీమాగా ఉన్నాడు. స్టార్ గా తనని మరో రేంజ్ కి పూరి జగన్నాధ్ తీసుకెళ్తాడనేది గట్టి నమ్మకం. పూరి కూడా విజయ్ తో బాగా జెల్ అయ్యారు.

తాజా సమాచారం ప్రకారం, పూరి, విజయ్ దేవరకొండ మరో సినిమాకి కమిట్ అయ్యారు. ‘లైగర్’ విడుదల తర్వాత విజయ్ తోనే మరో సినిమా చెయ్యాలని పూరి భావిస్తున్నట్లు టాక్.

మరోవైపు, విజయ్ మైత్రి సంస్థకు శివ నిర్వాణం డైరెక్షన్ లో ఒక మూవీ చెయ్యాలి. ఆ సినిమా గురించి ఇంకా అధికారికంగా ప్రకటించాలి.

 

More

Related Stories