తమిళ మార్కెట్ పై విజయ్ ఫోకస్

Vijay Devarakonda

విజయ్ దేవరకొండ పాన్ ఇండియా హీరో అయిపోదామనుకున్నాడు. కానీ, “లైగర్” దెబ్బకి రియల్టీలోకి వచ్చాడు. ఇప్పుడు రెండు మార్కెట్లు పెంచుకుంటే చాలు అనుకుంటున్నాడు. తెలుగుతో పాటు తమిళ మార్కెట్ పై ప్రధానంగా దృష్టి పెట్టాడు ఈ “ఫామిలీ స్టార్”.

విజయ్ దేవరకొండకి “అర్జున్ రెడ్డి”, “గీత గోవిందం” సినిమాలతో సౌత్ ఇండియా అంతా యువతలో క్రేజ్ వచ్చింది. కానీ విజయ్ చేసిన పొరపాట్లతో ఆ క్రేజ్ మిగతా భాషల్లో మెల్లగా పోయింది. ప్రస్తుతం తమిళ మార్కెట్ లో మాత్రం ఇంకా గట్టిగానే ఉంది.

విజయ్ దేవరకొండ, సమంత నటించిన “ఖుషి” సినిమా తమిళ వర్షన్ మంచి విజయ్ సాధించింది. అక్కడ హిట్ సినిమా అది. అందుకే, ఇప్పుడు “ఫ్యామిలీ స్టార్” సినిమాని కూడా తమిళంలో విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ వెర్షన్స్ మాత్రమే ఎక్కువ ప్రోమోట్ చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు విజయ్. తమిళ మార్కెట్ పూర్తిగా పట్టులోకి వచ్చాక మెల్లగా పాన్ ఇండియా గురించి ఆలోచిద్దామని అనుకుంటున్నాడని టాక్.

విజయ్ దేవరకొండ త్వరలోనే దర్శకుడు గౌతమ్ తిన్ననూరి సినిమా చేస్తాడు. ఆ తర్వాత మరో రెండు సినిమాలు లైన్లో పెట్టనున్నాడు.

Advertisement
 

More

Related Stories