
ప్రభాస్, వెంకటేష్, వరుణ్ తేజ్, నిఖిల్ సిద్ధార్థ్… ఇలా పలువురు టాలీవుడ్ హీరోలు రెండు భాగాలు లేదా సిరీస్ లో రెండు చిత్రాల్లో నటించారు. త్వరలో బాలయ్య కూడా “అఖండ 2” చెయ్యనున్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా ఈ లిస్ట్ లో చేరనున్నాడట.
విజయ్ దేవరకొండ త్వరలో మొదలు పెట్టనున్న ఒక కొత్త సినిమాని రెండు భాగాలుగా తీస్తారట.
‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక పీరియడ్ మూవీని అంగీకరించారు విజయ్ దేవరకొండ. ఈ సినిమా అధికారికంగా లాంచ్ అయింది షూటింగ్ కూడా కొన్ని రోజులు జరిగి ఆగింది. ఈ గ్యాప్ లో విజయ్ దేవరకొండ పరశురామ్ దర్శకత్వంలో మరో సినిమా మొదలుపెట్టి ఆ సినిమాని స్పీడ్ గా పూర్తి చేస్తున్నారు.
ఇక దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కథని మరింతగా డెవలప్ చేసి ఈ కథకు ఉన్న స్కోప్ ని దృష్టిలో పెట్టుకొని దీన్నీ రెండు భాగాలుగా చెయ్యాలనుకుంటున్నాడట. దానికి నిర్మాత నాగవంశీ కూడా అంగీకరించినట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని ప్రకటిస్తారట.
ప్రస్తుతం పరశురామ్ డైరెక్షన్లో చేస్తున్న మూవీతో విజయ్ దేవరకొండ 12 చిత్రాల్లో నటించినట్లు అవుతుంది. ఇక గౌతమ్ తిన్ననూరి చిత్రం 13, 14గా మారుతాయన్నమాట.