
బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, ఫేమ్ నరేష్ అగస్త్య ప్రధాన తారాగణంగా రూపొందిన మూవీ… ‘పంచతంత్రం’. హర్ష పులిపాక దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు కలసి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఈ చిత్రంలోని “అరెరే అరెరే మాటే..రాదే..మనసే పలికే క్షణములో” లిరికల్ వీడియోను సెన్సేషల్ హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు.
“అరెరే అరెరే మాటే..రాదే.. మనసే పలికే క్షణములో…
పిలిచి అడిగి ఆరా తీ..సి చనువే వెతికే వయసులో..
ఎదురు బదురు చేరే వేళ
నదురు బెదురు మామూ..లేనా.. తానే ఇపుడు గీత దాటేలా మో.. మాటలేనా… ఓహోహో హో..” అని సాగుతుంది ఈ పాట.
కిట్టు విస్సాప్రగడ రాశారు ఈ పాటని. ప్రశాంత్ ఆర్. విహారి, శ్రవణ్ భరద్వాజ్ ల సంగీతంలో చిన్మయి,ఎస్.పి చరణ్ లు అద్బుతంగా ఆలపించారు.
“ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని అన్నారు నిర్మాతలు అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు.