విజయ్ పార్టీ గోవాలోనే!

Vijay Deverakonda

విజయ్ దేవరకొండ కూడా గోవా వెళ్ళిపోయాడు. న్యూ ఇయర్ పార్టీ సెలెబ్రేషన్స్ కి సినిమా తారలందరూ గోవాకి చెక్కేశారు. హైదరాబాద్ లో పార్టీలు బ్యాన్. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దాంతో సినిమా స్టార్స్ అందరూ వేర్వేరు ప్రాంతాలకు వెళ్తున్నారు.

గోవాలో పార్టీ కోసం ఇప్పటి చైతన్య, సమంత, దిల్ రాజు కుటుంబం, నాని వెళ్లారు. విజయ్ దేవరకొండ సోలోగానే గోవా వెళ్ళాడు.

విజయ్ దేవరకొండ బాడీ బాగా పెంచాడు. పై ఫోటో చూస్తే, విజయ్ లావు కూడా పెరిగాడు. ఇదంతా… పూరితో తీస్తున్న సినిమా కోసమే.

More

Related Stories