విజయ్ దేవరకొండని మెచ్చుకోవాల్సిందే!

Vijay Deverakonda and Ananya Panday


సినిమాకి పబ్లిసిటీ, ప్రొమోషన్ చాలా ముఖ్యం. ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రం అంటే దాని కోసం పడే తిప్పలు వేరే ఉంటాయి. “ఆర్ ఆర్ ఆర్” సినిమా కోసం దర్శకుడు రాజమౌళి హీరోలిద్దర్నీ దేశమంతా తిప్పారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ వందల ఇంటర్వ్యూలచ్చారు. డజన్ల కొద్దీ మీడియా ఈవెంట్స్ కి అటెండ్ అయ్యారు. ఆ సినిమా హిందీలో భారీ విజయం సాధించింది.

ఇక, ఇప్పుడు విజయ్ దేవరకొండ అంతకన్నా ఎక్కువ కష్టపడుతున్నాడు. ‘లైగర్’ సినిమాకి రాజమౌళిలాంటి బ్రాండ్ నేమ్ లేదు. విజయ్ దేవరకొండ ఇంతకుముందు ఒక్క హిందీ చిత్రంలో నటించలేదు. అయినా, దేశమంతా తిరుగుతున్నాడు. తన సినిమాకి ఇప్పటికే పాన్ ఇండియా లెవల్లో అటెన్షన్ తెచ్చాడు.

విజయ్ దేవరకొండ మాటలు, చేష్టలు కొందరికి అతిగా అనిపించొచ్చు. కానీ, ఒక్క హిందీ చితం చెయ్యకుండా, గత మూడు సినిమాలు అపజయం పాలు అయినా జాతీయ స్థాయిలో ఇంత పబ్లిసిటీ తీసుకురావడం అంటే మాటలు కాదు కదా. సినిమా కోసం ఏమైనా చేసే హీరో అనిపించుకున్నాడు దేవరకొండ. సినిమా ఆడుతుందా లేదా అన్నది తర్వాతి సంగతి. ముందు… ఓపెనింగ్ తెచ్చుకునేలా ఎంత చెయ్యాలో అంత చేస్తున్నాడు విజయ్.

ఆయన కమిట్ మెంట్ కి కాంప్లిమెంట్ ఇవ్వాల్సిందే.

 

More

Related Stories