లైగర్ డ్యాన్స్ ఇరగదీశాడట!


విజయ్ దేవరకొండకి యూత్ లో ఉన్న ఫాలోయింగ్ వేరు. తన నటనతో, తన అందం, తన ఆటిట్యూడ్ తో క్రేజ్ తెచ్చుకున్నాడు. మిగతా స్టార్ హీరోల్లా డ్యాన్స్ విషయంలో ప్రూవ్ చేసుకోలేదు. ఐతే, ‘లైగర్’లో అది కూడా చూపించనున్నాడట. ఇటీవల విడుదలైన సాంగ్ ప్రోమోలో విజయ్ వేసిన స్టెప్ప్పులు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.

‘లైగర్’ సినిమాలోని ఈ పాటలో ఫ్లోర్ మీద వేసిన స్టెప్పులు నిజంగా హైలెట్ కానున్నాయి. ఫుల్ సాంగ్ చూస్తే విజయ్ డ్యాన్స్ కూడా ఇరగదీశాడు అనడం ఖాయం అని టీం చెప్తోంది. ఈ పాట ఈ నెల 11న విడుదల కానుంది.

దర్శకుడు పూరి జగన్నాధ్ విజయ్ ని పూర్తిగా మాస్ పంథాలో ప్రెజెంట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో దేవరకొండ ఒక బాక్సర్ గా నటించాడు. వచ్చే నెల 25న విడుదల కానుంది. నటుడిగా ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న దేవరకొండ ఇక మాస్ హీరోగా నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగమే ఇదంతా.

ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే నటించింది.

 

More

Related Stories