- Advertisement -

విజయ్ దేవరకొండ (వీడి)కి డైహార్డ్ ఫాన్స్ ఎక్కువే. ముఖ్యంగా అమ్మాయిలు విజయ్ దేవరకొండ కోసం పడి చస్తారు. ఒక అమ్మాయి ఏకంగా తన వీపుపై విజయ్ దేవరకొండ ఫోటోని టట్టూగా వేయించుకొంది. ఉత్తుత్తి టట్టూ కాదు ఎప్పటికీ చెరగనిది.
విషయం తెలుసుకున్న వీడి ఆ అమ్మాయిని కలుసుకున్నాడు. తన అభిమాన హీరో పిలిచి మరి అందరిని పరిచయం చేసి తనని ఒక రాణిలా ట్రీట్ చెయ్యడంతో ఆమె ఆనందంతో కన్నీళ్లు ఆపుకోలేక పోయింది.
‘లైగర్’ ఆఫీస్ కి వచ్చిన ఆ అమ్మాయిని వీడి సాదరంగా ఆహ్వానించాడు. దర్శకుడు పూరి జగన్నాధ్, నిర్మాత ఛార్మి తదితరులకు పరిచయం చేశాడు. ప్రతి అభిమానిని స్పెషల్ గా చూసే విజయ్ కి అందుకే అంత ఫాలోయింగ్.
విజయ్ ప్రస్తుతం ‘లైగర్’ ప్రొమోషన్ లకు సిద్ధం అవుతున్నాడు..