ఆసక్తిని రేపే VD12 పోస్టర్

Vijay Deverakonda

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక చిత్రం రూపొందనుంది. ఇది విజయ్ దేవరకొండ కెరీర్ లో 12వ సినిమా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించే ఈ సినిమాలో విజయ్ సరసన శ్రీలీల నటించనుంది.

Advertisement

నేడు(మే 9) విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఓ ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్ చాలా క్రియేటివ్ గా ఉంది. చీల్చిన కాగితపు ముక్కలపై కథానాయకుడి రూపం కనిపించడం ఆకట్టుకుంటోంది.

ఈ పోస్టర్ పై “I don’t know where I belong, to tell you whom I betrayed – Anonymous Spy” అని రాసుంది. పోస్టర్ చాలా ఆసక్తిని రేపుతోంది. గౌతమ్ తిన్ననూరి మరో మంచి చిత్రం తీయనున్నారు అనిపిస్తోంది.

అనిరుధ్‌ రవిచందర్‌ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా గిరీష్ గంగాధరన్ పనిచేస్తారు. సినిమా షూటింగ్ జూన్ నుండి ప్రారంభం కానుంది.

Advertisement
 

More

Related Stories